Friday, January 13, 2012

బభకు 'ప్రేమప్రస్థానం'-'విర్హవృష్టి'


 శ్రీ శ్రీ 'మహాప్రస్థానం'-'ఖడ్గసృష్టి' స్పూర్తితో పెట్టాను ఆ పేరు..

ప్రేమ పైన నా అభిప్రాయాలు....
LOVE,
ISHQ,
PYAAR,
KAADHAL,
PREMA....... ఈ సృష్టిలో ఎన్నెన్నో భాషలు....ఆలానే ప్రేమాకు ఏవేవో నిర్వచనాలు వున్నాయ్. ప్రేమ పైన నా అభిప్రాయాలు....
----------------------------------------------
ప్రేమ ఓ తీయని అనుభూతి .... .
అమ్మ వొడిలో కమ్మని ప్రేమ,
నాన్న చేతి స్పర్శలో వెచ్చని ప్రేమ ,
స్నేహితుల చెలిమి లో చిలిపి ప్రేమ ,
ప్రియురాలి ఊహలలో ప్రాణమే ప్రేమా .....
----------------------------------------------
చెలి మదిలో చోటు కోసం వేచివున్నాను... తన చెంతకు చేరే కాలం కోసం ఎదురు చూస్తువున్నాను...
తను అవునన్నా కాదన్నా ...తను నాదే అన్న భావనలో... ఆనందిస్తున్నాను..
ప్రతి క్షణం తనకోసమే నిరీక్షిస్తున్నా .... జడివానల,వడగాలుల సెగలు తట్టుకోలేకున్నాను...
-----------------------------------------------
ప్రేమలో పడితే ఈ విధంగా పిచ్చి పిచ్చి కవితలు వస్తే.....
పని పాట లేనే వారు చేసే పనికి పెట్టుకున్న పేరు ప్రేమ....
ప్రేమకు నోచుకోని వారికి పనికి రానిది, పనికి మాలినిది ప్రేమా...
ప్రేమికులకు తీపి,భూలోక స్వర్గం ప్రేమ...
ప్రేమ విఫలులకు చేదు ,నరకం ఈ ప్రేమా...
--------------------------------------------------
కడుపు నిండితేనే ఆకలి తీరేది....మనసు పండితేనే ప్రేమ పుట్టేది..
--------------------------------------------------
ప్రతి ఆరాటానికి ఒక ఊరట వుంటుంది...
ఎండమావులు కనిపించే వేసవిలో
చలివేంద్రాలు కూడా ఉంటాయ్....
చూపుల కన్నా ఎదురుచూపులే మిన్న...
ప్రేమ కన్నా ఆరాధనే గొప్పదన్న
సత్యం ఎరుగర నాన.....
---------------------------------------------
ప్రేమ ఒక వరం ..ప్రేమించ బడినప్పుడు
ప్రేమ ఒక శాపం ..ప్రేమించ బడనప్పుడు
-----------------------------------------------
ప్రాణ మైన ఇవ్వగలను నీ ప్రేమకై....
ప్రాణమున్నంత వరకే ప్రేమించగలను..కాబట్టి..
ప్రాణము ఇవ్వలేకున్నాను...
నీకోసమే నా శ్వాస ఆడుతుంది..
నీ రాకకై నా చూపు వెతుకుంది..
నీ మాటకై నా నోట నాలుకుంది...
నీకై ఈ జీవితం అంకితమంది.
------------------------------------------------
నీవు నా దానివని నేను తలచిన క్షణాన్ని నేను మరవలేను...
నేను నీ కోసం నిరీక్షించిన క్షణ యుగాల్ని మరవలేను...
మన కలయికకై వేచిన స్థలాల్ని మరువలేను...మనం తిరిగిన వనాల్ని మరువలేను .
నన్ను నీకోసం,నిన్ను నాకోసం పుట్టుంచిన మన తల్లిదండ్రులను మరువలేను..
నువ్వు ఇక నాదానివి కావని తెలిసినా పగలని నా గుండెను మరువలేను...


ఎందుకంటే నాకు మతి మరుపు లేదు గా ?????
-----------------------------------------------
నేనడిగిన నీ దర్శనం...నీవలిగిన ఆ క్షణం
నామది నలిగిన ఆక్షణం.. మనకు కలిగిన ప్రేమకు నిదర్శనం.
నాకు తగిలిన నీ చూపుల బాణం ..తీసెను నాలో మిగులు ప్రాణం..
---------------------------------------------------
నిన్ను చూసాక నీ గురించి తెలుసుకోవాలనిపించింది
నీ  గురించి తెలిసాక నీతో మాట్లాడలనిపిమ్చింది
నీతో  మాట్లాడాక నీతో స్నేహం చేయాలనిపించింది
నీతో స్నేహం చేశాక నీ ప్రేమను పొందాలనిపిమ్చింది
నీ ప్రేమను పొందాక నిన్ను  పెళ్లి చేసుకోవాలనిపిమ్చింది....

నిన్నుపెళ్లి చేసుకున్నాకా ...నాకెందుకే  నిన్నువదిలెయ్యాలనిపిస్తుంది ??????
------------------------------------------------------------
మిత్రమా ....నీ వెవరవు మిత్రమా
నిన్ను చూస్తుంటే ..నన్ను నేను చూసుకున్నట్టు వుంది .
నీతో మాట్లాడుతూ వుంటే ..నాలో నేను మాట్లాడుకున్నట్టు వుంది
నీతో నడుస్తుంటే ఒంటరిని కాదనిపిస్తుంది...
నేను నీవై ..నువ్వు నేనై ..నువ్వు నేను ఒకటై ...ఈ పయనం ఎంతవరకు....ఎందుకొరకు..
{{కడవరకు.. చివరకు చితివరకూ ( కావాలనిపిస్తుంది)... నీకు రావలనిపిస్తుందా?/}}
---------------------------------------------------------------------
ANNONYMOUS SAID :
"Biggest Problem In Love"

Good Boy Gets The Wrong Girl...
&
Good Girl Gets ...Wrong Boy...

They Fall In Love
&
Good Ones Get Cheated..

Now The Good Boys Thinks,All Girls Are Fraud..
&
Good Girls Thinks,All Boys Are Flirts.....

When Good Boy & Girl Meet Each-Other ...

They Avoid Falling In Love ... ♥

బభకు= బద్వేలి భరత్ కుమార్ 

Friday, January 6, 2012

నువ్వు-నేను-ఆనందం-అబద్ధం


మరపు రాదే రమ్మన్నా నీ పై  ప్రియతమా
చొరవ చూపవే ఇకనైనా నా పై ప్రియతమా
మరుపన్నది వరమని తెలియదే, నీవు నాకు దూరమయ్యేంతవరకు
నిను మరవలేక, నీ మదిని చేరలేక వ్యధ మిగిలే చివరకు!!!!!

నువ్వు లేక నేను లేను అన్నాను
నువ్వే నా ప్రాణమని  అన్నాను- (అది అబద్ధమే చెలి)
నువ్వు లేకున్నా, నువ్వు నాకు కాకున్నా , నేను ఇంకా ప్రాణంతోనే వున్నాను.

నీతో మాటాడితే బాగుందని, మాట్లాడుతుంటే బాగుంటుందని
నీతో మాట్లాడకుండా ఉండలేనని, నీతో మాట్లాడుతూనే వుండాలని ఉందని అన్నాను -(అది అబద్ధమే  చెలి).
 నీతో మాట్లాడుట లేదు, మాట్లాడుతూ లేను, మాట్లాడాలనుకోవడం లేదు.ఐన నేనున్నానే  చెలి.

నీ కనులు అందం... వాటి చూపులు మరింత అందం
నీ అధరాలు అందం... అవి నీ చిరునవ్వుతో అధిరితే అందం
నీ బుగ్గలు అందం... వాటి పై నీ సిగ్గు మొగ్గలు అందం అని ఎన్నో అన్నాను. ( అది అబద్ధమే చెలి)

నీ కళ్ళలోకి చూడలేకున్నాను, నీ చూపులు తాళ్ళలేకున్నాను
నీ పెదవులను, వాటి కులుకులను పట్టనట్టే ఉంటున్నాను.

నీ మెడ అందం, వాలు జడ అందం
నీ నడుము అందం, నీ నడక అందం
నీ పాదం అందం, వాటికున్న మువ్వల సవ్వడి అందం అన్నాను.( అది అబద్ధమే చెలి)
నీ మెడ వైపు, జడ వైపు,
నడుము వైపు,నడక వైపు చూడ లేకున్నాను.

నన్ను ఎంతగానో (ఏ)మార్చినావే  , నాకేదో మాయ చేశావే
ఎన్ని వచ్చినా( ఆటంకాలు), ఏమీ జరిగినా (అవరోధాలు) నిన్ను నేను వీడిపోను
నీవుంటేనే నాకానందం, నువ్వంటేనే నా ఆనందం అన్నాను.

అంతలోనే అంతగా మారిపోయానని అనుకుంటున్నావా చెలి.
నేనన్నవన్నీ అసత్యాలని అనుకుంటున్నావా చెలి.
ప్రాణం వుంది.దేహముంది.నేనున్నాను.
కాని ఆనందం లేదే చెలి. ఆనందంగా లేనే చెలి.
నా ఆనందం నీవే. నీ దగ్గరేనే ఉందే చెలి.

'నన్ను' నా కన్నా ఎవరూ ప్రేమించలేరని తెలుసుకున్నాక,
నీకు నా పైన ప్రేమ లేదని తెలిశాక,
మనం ప్రేమించేవారికన్నా, మనల్ని ప్రేమించేవారే మిన్నని ఎరిగాక,
నన్ను నేను ప్రేమిస్తునందుకు, నిన్ను నేను 'నా'కన్నా ఎక్కువగా ప్రేమించానని
నా పై నా ప్రేమను మళ్ళించా నీ పై నుంచి

కాని......

నీకు నేను దూరమై , నాకు నేను దగ్గరయ్యేసరికి, నా ఆనందానికి  కారణం నేను కాదని,
ఆ ఆనందానికి కారణం నువ్వేనని, నా  ఆనందమే నువ్వని తెలుసుకున్నాక... నీ గురించే ఆలోచిస్తున్నా....

మరుపన్నది వరమని తెలియదే, నీవు నాకు దూరమయ్యేంతవరకు
నిను మరవలేక, నీ మదిని చేరలేక వ్యధ మిగిలే చివరకు!!!!!
మరపు రాదే రమ్మన్నా నీ పై  ప్రియతమా
చొరవ చూపవే ఇకనైనా నా పై ప్రియతమా