Saturday, March 31, 2012

నమ్మొద్దు నమ్మొద్దు 'ఆ' ఆడవాళ్ళను నమ్మొద్దు...


"నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు .... పిచ్చిగా ప్రేమించి బిచ్చగాల్లై పోవోద్దు."


"నమ్మకు నమ్మకు ఆడాల్లలోని ప్రేమలని ... నమ్మిన వాళ్లకు చూపెడుతుంది నరకాన్ని."
ఇటువంటి పాటలు విన్న వెంటనే ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చేస్తునాయ్. బహుసా అది సహజ సిద్ధంగా వచ్చిన పురష అహంకరం వలనో, లేదా ప్రేమకు నోచుకోలేదనే అక్కసుతోనో అయివుండొచ్చు అనుకున్నాను.


అసలు ఆడవాళ్ళలో ఏముంది.? మగవారు ఎందుకు వారి పట్ల ఎందుకు అంతగా ఆకర్షితులుం  అవుతున్నాం?
(ఈ మధ్య కొందరు మగవారు మగవారి పట్ల కూడా ఆకర్షితులవుతున్నారట.... ప్రస్తుతానికి అది అప్రస్తుతం).

 ఈ విశ్వాన్ని మొత్తం ప్రకృతి,పురుషుడు(పరమాత్మ)తో కొలుస్తారని ఎక్కడో ఎప్పుడో విన్నట్టు గుర్తు. పురుషుడు పురుషోత్తముడిలోని అణువుగా బావించినటులైతే  , స్త్రీ మాయా మోహిత ప్రకృతి అన్నమాట.

మగవారి ఆశ,ఆవేశం,ఆశయం,ఆవేదన,ఆనందం,ఆలోచన అన్నీ ఆడవారే. అంతా మాయ.వీటన్నిటిని తెంచుకుని, ఆ మాయతో విడివడి తను (పురుషుడు) తానే( పురుషోత్తముడే)నని తెలుసుకోవడమే మోక్షం.

ఇక ఇహానికి వద్దాం. ఆడ నెమలిని ఆకట్టు కోవడానికి మగ నెమలి నాట్యం చేస్తుంది. ఆడ కోయిలతో కలవడానికి మగ కోకిల పాట పాడుతుంది. కప్ప బెక బెక మని కూని రాగాలు తీసినా, కోడిపుంజు కొక్కోరుకో మని కూత కూసిన,     జత కట్టడానికే... తోడు ఉండడానికే.ప్రతి ప్రాణికి ఆకలి, దప్పిక , నిద్ర , మైథునం అనేవి సహజం.


" బుద్ది " వున్న (వుంది  అనుకుంటున్న ) మనిషి ఆ నాలుగింటి లోనీ వివిధరకాల రుచులు కనిపెట్టి , వాటిని పొందడాని, ఆ పొందికలో సుఖాన్ని,ఆనందాన్ని వెతకడం మొదలు పెట్టాడు. స్త్రీలేని పురుషుని జీవితం, పురుషుడులేని స్త్రీ జీవితం అసంపూర్ణం. తమ తమ జీవితాలని పరిపూర్ణం చేసుకోదలచిన స్త్రీ,పురుషులిరువురూ ఒకరినిని ఒకరు ఆకర్షిస్తూ..(స్త్రీ అందంతో,నయగారంతో,వయ్యరంతో-పురుషుడు మాటలతో ,చేష్టలతో) ఈ సృష్టి క్రమాన్ని నడిపిస్తున్నారు.


(ఇక్కడ వరకు అంతా బాగానే వుంది ,ఇప్పుడే నాలో పురుషాహంకారం అనుకురిమ్చింది.)

సాఫీగా సాగిపోతున్న ఈ సంసారంలో ఆడవారివల్ల ఎన్నో యుద్ధాలు. ఒక స్త్రీ మూలాన రామరావణ యుద్ధం, మరో  స్త్రీ వలన మహాభారత యుద్ధం, ఒక త్రోజన్ వార్... ఇప్పుడు ఈ కలి కాలంలో సంపూర్ణ స్వేచ్చా వాయులు పీల్చుకుంటున్న స్త్రీలు ఇంకా ఎన్నో అనర్ధాలకు కారణం అవుతున్నారు.వారి మితిమీరిన అపరిమిత అతిపరిపక్వ జ్ఞానం మూలం సంసారాలను చిన్నాబిన్నం చేస్తున్నారు.


నిజంగా ప్రేమించే వారిని నమ్మక ఒకసారి , వంచించే వారినే ప్రేమించి మరో సారి తప్పు చేస్తున్నారు. అసలు స్త్రీ మానసిక స్థితి ఏమిటి?మగవారిపై వారికి గల  నమ్మకం & వారి స్థిర  చిత్తం ఎంతవరకు అని విశ్లేషించి చూడగా .. చూడగా .. సుమతి శతకంలోని కొన్ని పద్యాలతో .....


కోమలి విశ్వాసంబు
బాములతో జెలిమి,  యన్య భామల వలపున్
వేముల  తియ్యదనంబు
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతి!

భావం: స్త్రీల యొక్క నమ్మకమును, పాములా యొక్క స్నేహమును, పరస్త్రీల యొక్క మోహమును, వేపచెట్టు తియ్యదనము,రాజుల యొక్క విశ్వాసము నమ్మరాదు(అసత్యములు).

*మగవారు స్త్రీలతో చెలిమి చేసేది కేవలం 'అందుకే' అనే అభిప్రాయాన్ని చాల మంది స్త్రీలలో వుంది.


చింతింపకు కదచినపని
కింతులు వలతురని నమ్మకెంతయు మదిలో
నంతః పుర కాంతలతో
మంతనములు మాను మిదిమె మతముర సుమతి!

భావం: జరిగిపోయిన  పని గూర్చి ఆలోచించుటను, స్త్రీలు ప్రేమించెదరని విశ్వాసము వ్యక్తము చేయుటయును, అంతఃపుర స్త్రీలతో రహస్యములు మాట్లడుటయును వెంటనే సద్గుణములు గలవాడు విడిచిపెట్టవలెను.

*ఏదో మనతో స్నేహంగా ఉన్నంత మాత్రాన మనలను ప్రేమిస్తారు అనుకోవడం వృధా.




అల్లుని మంచితనంబు
గొల్లని సాహిత్యవిద్య , కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యము
దెల్లని కాకులును లేవు తెలియర సుమతి.

భావం: అల్లుని మంచితనము, గొల్లవాని పాండిత్య జ్ఞానము, ఆడదానియందు నిజమును,పొల్లు ధాన్యములో బియ్యము, తెల్ల కాకులు ఈ లోకలో వుండవు.

కాదుసుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్
వాదుసుమీ యప్పిచ్చుట,
లేదుసుమీ సతుల వలపులేసము సుమతి!

భావం: దుర్జనుడితో స్నేహము చేయరాదు. కీర్తి వచ్చిన పిదప నశించదు. అప్పులిచ్చుట వలన కలుగును వాదు. స్త్రీల కడ ప్రేమ ఉండదు.


కప్పకు నొరగాలైనను

సప్పమునకు రోగమైన సతి తులువైనన్ 
ముప్పమున దరిద్రుడైనను
దప్పదు మఱి దుఃఖమగుట తధ్యం సుమతి!

భావం: కప్పకు కాలు విరిగినను, పాముకు రోగము వచ్చినను, భార్య దుష్టురాలు ఐనను, ముసలితనములో దారిద్ర్యము వచ్చినను మిక్కిలికష్టము గానుండును.

గడనగల మగని జూచిన
నడుగడుగున మడుగలిడుదు రతివలు తమలో
గడనుడుగు మగని జూచిన
నడపీనుగు వచ్చెననుచు నగుదురు సుమతి!

భావం: స్త్రీలు సంపద గలిగిన భర్తను చూచి అతని ఆజ్ఞలో అడుగులకు మడుగులోత్తుచూ గౌరవించెదరు.సంపద లేని, సంపాదించలేని భర్తను చూచినచో నడుచునట్టి శవము వచ్చెనని హీనము చేసి నవ్వెదరు అని భావం.



ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాడే
గొల్లండు గాక ధరలో
గొల్లండు గొల్ల డౌనే గుణమున సుమతి!

భావం:తనను ప్రేమించని పెండ్లామును, ప్రేమించని యజమానిని, ప్రేమింపని స్నేహితుని విడిచిపెట్టుటకు ఇష్టపడని వాడే వెర్రి గొల్లవాడు అగును.కాని గొల్ల కులమున పుట్టిన వాడు స్వభావ గుణములచే వెర్రి గొల్లవాడు కాడు.


కొక్కోకమెల్ల జదివిన
జక్కని వాడైన రాజచంద్రుడైనన్
మిక్కిలి రోక్కంబీయక
చిక్కదురా వారకాంత సిద్దము సుమతి!

భావం:వెలయాలు పూర్తిధన మీయకున్నచో, కామశాస్త్రమెల్ల చదివినాను, అందగాడైనాను ,రాజైనను ప్రేమానంద సౌఖ్యము ఇవ్వదు.తనకి ధనమే ప్రధానము, ప్రేమ కాదు.

తల పొడుగు ధనము బోసిన

వెలయాలికి నిజములేదు వివరింపంగా
దల దడివి బాస జేసిన
వెలయాలిని నమ్మరాదు వినార సుమతి!

నమ్మకు సుంకరి ,జూదరి
నమ్మకు మగసాలివాని, నటు వెలయాలిన్
నమ్మకు మంగడి వానిని
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతి!

భావం : ఇంటి పన్నులు వసూలుచేసేవారిని, జూధమాడువానిని, బంగారం మేరుగుపెదతం అని వచ్చేవారిని, వేశ్యలను,వస్తువులు అమ్మేవారిని, ఎడమ చేతివాటం కలవారిని నమ్మరాదు.

వెలయాలి వలన గూరిమి
గలుగదు మఱి గలిగినేని కడతేరదుగా
పలువురు నడిచెడి తెరువున
బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతి!

భావం: జనులు నడిచెడి మార్గమున పచ్చ గడ్డి పుట్టదు.ఒకవేళ మొలచినను పెరగదు.అలానే వెలయాలి వలన ప్రేమ పుట్టదు.ఒక వేల లభించినను చిరవరకూ ఉండదు.అంటే వెలయాలి ప్రేమ స్థిరము కాదని భావం.

వెలయాలు సేయు బాసలు,
వెలయగ నగసాలి పొందు, వెలమల చెలిమిన్
గలలోన గన్న కలిమియు,
విలసితముగ నమ్మరాదు వినరా సుమతి!

భావం: వేశ్యా ప్రమాణములు నమ్మవద్దు.స్వర్ణ వృతి వారి స్నేహము చేయవద్దు.వెలమ దొరల వెంట నడవరాదు.కలలో చూచిన సంపద రాదూ.


నమ్మొద్దు నమ్మొద్దు "ఆ" ఆడవాళ్ళను నమ్మొద్దు......

ఆడది మగవాడి జీవిత గమ్యానికి వారధి. ఆడవాళ్ళు అంటే ఆ  ఆడవాళ్ళు  మాత్రమే కాదుగా.. ప్రేమను పంచే అమ్మను మరువలేము, అనురాగానిచ్చే అక్కని మరువలేము, ఆప్యాయతకు అర్ధం తెలిపే చెల్లిని మరువలేము,మమకారాన్ని చూపే అమ్మమ్మ,అత్తయ్యలు మరువలేము.


అన్నిటికన్నా మిన్నగా మన జీవితానికి అర్ధాన్నిచ్చే, అర్దాంగిని మరువలేము.


పనిచేయునెడల దాసియు
ననుభవమున రంభ,మంత్రి ఆలోచనలన్
ధన భుక్తి యెడల దల్లియు
యనదన కులకాంత యుండనగురా సుమతి!

భావం : "కార్యేషు దాసీ..." అను పద్యమునకు అనుకరణము.

ఈ క్రింది పద్యములు చదివితే స్త్రీ గొప్పతనం తెలుస్తుంది...

పనసతొనలకన్న పంచధారలకన్న

జుంటే తేనెకన్న జున్నుకన్న
చెరకు రసముకన్న చెలుల మాటలే తీపి
విశ్వదాభిరామ వినురవేమ!


వీడెము సేయని నోరును
చేడెల యధరామృతంబు జేయని నోరున్
బాడున్గా రాణి నోరును
బూడిద కిరవైన బొందర సుమతి!

భావం : తాంబూలం వేసుకోనని నోరు,స్త్రీల అధరామృతాలు పానము చేయని నోరు,గానము చేయని నోరు బూడిద పోసుకునే గోయ్యలాంటిదని భావం.

పలుదోమి సేయు విడియము
తలగడిగిన  నాటి నిద్ర, తరుణులయెడలన్
పొలయలుక నాటి కూటమి,
వెల యింతని చెప్పరాదు వినరా సుమతి!

భావం : దంతధావనం చేసిన వెంటనే వేసిన తాంబూలం, తలంటుకొని స్నానం చేసిన నాటి నిద్ర, స్త్రీలతో ప్రణయ కలహం వచ్చిన నాటి పొందును అత్యంత సౌఖ్య ప్రధములుగానుండును.వాటి విలువ ఇంతని చెప్పలేము.

నీరే ప్రాణాధారము,
నూరు రసభరితమైన నుడువుల కెల్లన్
నారియె నరులకు రత్నము
చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతి!

భావం :అన్ని ప్రాణులకు నీరే ఆధారము.నవరసభరితములైన మాటలకు ఆధారము నోరే. నరులకు స్త్రీయే రత్నమువంటిది.వస్త్రమే మానవునికి అందము తెచ్చునది.



అట్టి అర్ధాంగి యెడల ఎలా మసులుకోవాలో తెలియజెప్పే పద్యం:



కులకాంత తోడ నెప్పుడు
గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంటి కంట కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతి!

అర్ధంచేసుకోలేని ఆర్దాంగి  దొరికితే :

కవిగాని వాని వ్రాతయు
నవరస భావములు లేని నాతుల వలపుం
దవిలి చను పంది నేయని
వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతి!

పాటెరుగని పతి కొలువును,
గూటంబునకు కెరుకపడని కోమలి రాతియుం
జేటెత్తజేయు చెలిమియు
నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతి!

పిలువని పనులకు బోవుట
కలయని సతిరతియుం ,రాజు గానని కొలువుం
బిలువని పెరంటంబునకు
వలవని చేలియును జేయవలదుర సుమతి!

పైన చెప్పిన యుద్ధాలు స్త్రీల వలన వచ్చాయు అనుటకంటే, స్త్రీల కోసం మగవారు చేసారు అనుట ఉచితము. ఆడవారి పట్ల మగవారి దృక్కోణం మారనంత వరకు ఎన్ని తరాలు మారినా ఆ మారణఖండాలు మారవు.
మగవారు పరస్త్రీ యెడల ఎలా మాసాలు కోవాలో తెలియజెప్పే పద్యం :

పరనారీ సోదరుడై
పరధనముల కాసపడక, పరులకు హితుడై
పరులు తను బొగడ నెగడక
పరులలిగిన నలుగనతడు పరముడు సుమతి!

పరసతి కూటమి గోరకు,
పరధనముల కాసపడకు పరునెంచకుమీ,
సరిగాని గోష్టి సేయకు,
సిరిచెడి జుట్టంబుకడకు జేరకు సుమతి!

స్త్రీ,పురుషులిరువురూ ఎలా మసులోకోవాలో, ఎలా మెలగ కూడదో తెలియజెప్పే పద్యం:


పరసతుల గోష్టి నుండిన
పురుషుడు గాంగేయుడైన భువి నిందబడున్
బరసతి సుశీలయైనను
బరుసంగతినున్న నిందపాలగు సుమతి!


పరస్త్రీలతో సరసాలు పలుకుచున్నచో  పురుషుడు భీష్ముడంతటి బ్రహ్మచారి యైనను లోకమునందు అపకీర్తి పాలగును.అట్లేయ్ పరస్త్రీ ఎంతటి సుగుణవతి ఐనను , పరపురుషునితో స్నేహము చేయుచున్నచో అపకీర్తి పాలగును.


యత్ర నార్యస్తు పూజ్యతే
తత్ర రమంతే దేవతః


ఎక్కడ స్త్రీ లు పూజింపబడుతారో అక్కడ దేవతలు తిరుగుతారు.