Saturday, December 31, 2011

నేను





నేను 

నా పుట్టుకలో నేను లేను
నా చావును నేను చూడలేను
నిజ చావు పుట్టుకల మధ్య
నాటక జీవితమే నేను.
ఈ నటనా జీవితంలో నన్ను నేను కోల్పోయాను..

కడలిని నేను, బడలిక నేను.
సంద్ర సలిలపు అల్లరి పైకే
అగాధపు గాంభీర్యం  నాదే
కూటికి,కాసుకి,కాంతకి,కీర్తికి
ఆరాటపు పోరాటంలో అలసితి నేను.

మంచిని నేను, వంచన నేను
సత్యాసత్యాల సందు నలుగుతు నేను
ధర్మాధర్మాల సమాజపు అద్దం నేను
బొమ్మ - బొరుసు రెండూ ఉంటేనే చెల్లె నాణెం నేను.

 జన్మతః "శూద్రుడ్ని " నేను
స్వశక్తి పై నిలబడాలనే తపన వున్న " వైశ్యుడ్ని " నేను
ఈ దేశాన్ని పూర్వ సంస్కృతి,సాంప్రదాయలుతో,సర్వతోముఖాభివ్రుద్దికై రాజకీయ రంగప్రవేశ మొనరించదలచిన  " క్షత్రీయుడ్ని " నేను
ఈ సృష్టికి ఆధారభూతుడు ఆ పరమాత్ముడే నని  , అందరిలో వాడు ఉన్నాడని ఆ బ్రహ్మను ఎరిగిన " బ్రాహ్మణుడ్ని " నేను.

భాషలోని భావాన్ని నేను...
ఎదుటివారి కన్నీటిని  తుడిచే కరము కల వాడిని నేను....
మనిషై పుట్టి , మనీ  మత్తులో మునుగుతున్న మనసు లేని మానవునికి మార్గం చూపే వాడిని నేను....
భరతమాత దాస్య శృంకలాలనుండి విడిపించిన ఆ తరం వారిని గౌరవించి..
దారిద్ర్య పథంలోనికి తీసుకు పోతున్న నేటి 'నేతిబీరకాయ'- స్వార్ధ రాజకీయనాయకులను సన్మార్గం లో నడిపించ దలచిన వాడిని నేను.
ఆడ వారందూ అమ్మలే అనిన మన సంస్కృతి .... దిగజారి ..... అమ్మ కూడా ఆడదే అనే వరకు వచ్చినా ఏమి ఎరుగనట్టే వున్న మన మేథావులకు దిశ నిర్దేశించదలచిన వాడిని నేను

ఎందరో మహానుభావులు నిర్దేసించిన మార్గం
ఇలా కాగితాలకు పరిమితమై .. ఒట్టి మాటలకే కాక గట్టి మేలు తలపెట్ట దలచిన నేను

భగవంతుని ఏక చత్రాదిపత్యం ముందర అందరూ తల వంచాలసిందేనని
తనతో పోరాడి గెలిచే శక్తిని ఇవ్వమని ఆ దేవుడినే కోరుకున్నాను నేను
"అహం బ్రహ్మాస్మి" అని ఎరుగక నేను.

No comments:

Post a Comment